![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -121 లో..... రామరాజు ఇంటికి వస్తుంటే ఉల్లిపాయలు అమ్మే వ్యక్తి తమ వీధిలోకి వస్తుంటాడు. అతని దగ్గరున్న మైక్ ని తీసుకొని భద్రవతి కుటుంబానికి వినపడేలా.... మా పెద్ద కొడుకు చందుకి పెళ్లి ఫిక్స్ అయింది.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సంబంధాలు చెడగొట్టినా మా వాడికి పెళ్లి జరగబోతుందని మైక్ లో మాట్లాడతాడు. ఆ మాటలు విని భద్రవతి కుటుంబం కోపంతో రగిలిపోతుంది. మన ఇంటి ఆడబిడ్డలని మోసం చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారని భద్రవతి కోప్పడుతుంది.
ప్రేమ వాడిని పెళ్లి చేసుకొని ఏం సంతోషంగా ఉందని రెస్టారెంట్ లో పని చేస్తుందని రేవతి బాధపడుతుంది. ప్రేమ, ధీరజ్ లు మామిడి తోరణం కడుతుంటే అప్పుడే ప్రేమ నానమ్మ శారదాంబ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరే ఈ రెండు కుటుంబాలని కలపాలని అనుకుటుంది. ప్రేమ ధీరజ్ తోరణం కడుతుంటే ఇద్దరు పడిపోయి ఒకరిపై ఒకరు పడిపోతారు. ఇద్దరు రొమాంటిక్ గా చూసుకుంటారు.. నువ్వు నన్ను కావాలనే పడేసావని ధీరజ్ తో ప్రేమ గొడవపడుతుంది. ఆ తర్వాత రామరాజుతో సహా అందరు హాల్లో కూర్చొని ఉంటారు. నర్మద పెళ్లి పత్రిక చదువుతుంది. అందులో వేదవతి అమ్మనాన్నల పేర్లు ఉండడంతో వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మా అమ్మనాన్న పేర్లు కొట్టించారని వేదవతి అంటుంది. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం మీ నాన్న అని రామరాజు అంటాడు. మావయ్యకి మా కుటుంబం అంటే ప్రేమ ఉంది కానీ వాళ్ళు పగ అంటూ కోపంగా ఉన్నారని ప్రేమ అనుకుంటుంది. మరొకవైపు నీకు కాబోయే భర్తకి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పమని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. చందుకి శ్రీవల్లి ఫోన్ చేసి.. కలవాలి.. మాట్లాడాలని అంటుంది. తరువాయి భాగంలో చందు,శ్రీవల్లిల పెళ్లి పత్రికలో నర్మద, సాగర్ ల పేర్లు రాసి నర్మద మురిసిపోతుంటే ప్రేమ వచ్చి చూస్తుంది. పెళ్లి పత్రిక అనేది ఒక జ్ఞాపకం.. అది మనకి అదృష్టం లేదని ప్రేమతో నర్మద చెప్తూ ఎమోషనల్ అవుతుంది. అదంతా వేదవతి చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |